తమన్నా గుర్తుందా శీకాతాలం ఫస్ట్ లుక్

సత్యదేవ్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నాగశేఖర్ తెరకెక్కిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటణలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో నాగశేఖర్ మూవీస్ బ్యానర్ మీద నాగశేఖర్ - భావనరవి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం.
కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టేల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూట్ చేసుకుని మరో షెడ్యూల్ షూట్ చేసుకోవడానికి సెట్స్ మీదకు వెళుతుంది గుర్తుందా శీతాకాలం. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న గుర్తుందా శీతాకాలం చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు. అందులో సత్యదేవ్, తమన్నా ఒకర్నొకరు రొమాంటిక్గా చూసుకుంటూ చేతులు కలుపుకుని ఉన్నారు.