English   

విజయ్‌ దేవరకొండతో సారా అలీ ఖాన్‌ ఫ్యాన్‌ మూమెంట్ 

Sara Ali Khan
2021-02-15 18:10:56

విజయ్‌ దేవరకొండ మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘లైగర్‌’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముంబైతో పాటు విదేశాల్లో షూటింగ్ జరుగుతోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో కరణ్‌ నివాసంలో నిర్వహించిన పార్టీకి విజయ్‌ని ఆహ్వానించాడు. ఈ పార్టీకి విజయ్‌తో పాటు బాలీవుడ్‌ స్టార్‌ నటీనటులు దీపికా పదుకొనె, ఇషాన్‌ ఖట్టర్‌, అనన్య పాండే, సిద్దార్థ్‌ చతుర్వేదీలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆ పార్టీకి బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీ ఖాన్‌ కూడా వచ్చింది. ఈ క్రమంలో అక్కడ విజయ్‌తో ఆమె తీసుకున్న సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది.  దీనికి ‘ఫ్యాన్‌ మూమెంట్‌’ అంటూ విజయ్‌ను ట్యాగ్‌ చేసింది. దీంతో ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతొంది‌. ఇక అది చూసిన విజయ్‌ అభిమానులంత మురిసిపోతున్నారు. 

More Related Stories