English   

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోస్టార్ ఆత్మహత్య

 Sushant Singh Rajput
2021-02-16 10:47:13

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ను  ఇంకా సినీ లోకం మరవనేలేదు. అప్పుడే మరో ఘోరం చోటుచేసుకుంది. ఎమ్ ఎస్ ధోని సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితుడిగా నటించిన నటుడు సందీప్ నహర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్ ఎస్ ధోని సినిమాలో సందీప్ పాత్రకు పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తరువాత సందీప్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన కేసరి సినిమాలోనూ కీలక పాత్రలో నటించి అలరించాడు. ఎంతో ఫేమ్ ఉన్న నటుడు సందీప్ ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఢిల్లీ లోని గుడ్ గావ్ లో సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో తన భార్య పై సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి తరవాత అటు ఇండస్ట్రీలోనూ ఇటు వైవాహిక జీవితంలోను ఇబ్బందులు ఎదుర్కొంటునట్టు  పేర్కొన్నాడు. తన భార్య తనతో ప్రతిరోజూ గొడవకు దిగుతుందని చెప్పాడు. అంతే కాకుండా ఇప్పుడు ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని అన్నాడు. అయితే తన చావుకు మాత్రం ఎవరూ బాధ్యులు కారని..జీవితంలో ఆటుపోట్ల కారణంగానే సూసైడ్ చేసుకుంటునట్టు వెల్లడించాడు. అయితే సందీప్ ది ఆత్మహత్య అని పోలీసులు ఇంకా దృవీకరించలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నివేదిక అనంతరం రిపోర్ట్ భయటకు వచ్చే అవకాశం ఉంది.

More Related Stories