English   

సినిమాల్లోకి చైతన్య...క్లారిటీ ఇచ్చేసిన నిహారిక

 Niharika
2021-02-16 11:10:29

మెగా ఫ్యామిలీ నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన తోనే హిట్ అందుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి నిహారిక భర్త పైనే ఉంది. నిహారిక గుంటూరు ఐజీ కుమారుడు చైతన్య జొన్న గడ్డలను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందే నిహారిక చైతన్య జంట సోషల్ మీడియాలో రచ్చ చేయడం..చైతన్య ఎత్తు పొడుగు హీరోలా ఉండటంతో మెగా ఫ్యామిలీ నుండి .మరో రాబోతున్నాడు అంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇక వైష్ణవ్ తేజ్ సినిమా తరవాత నిహారిక భర్త ఎంట్రీ కూడా త్వరలోనే ఉంటుందని గుసగుసలు వినిపించాయి. 

ఇక గుస గుసలపై నిహారిక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చేసింది. తన భర్త చైతన్యకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని చెప్పింది. అతడు ఓ వ్యాపార వేత్త అని..చైతన్య కు గోల్స్ వేరే ఉన్నాయని వెల్లడించింది. ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, మెగాస్టార్ అల్లుడు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో అల్లు అర్జున్, రామ్ చరణ్ లు స్టార్ లుగా ఎదిగారు. సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ కూడా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. ఇక అల్లు శిరీష్ కూడా కొత్త కొత్త స్టోరీలతో ఫ్యాన్స్ ను సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

More Related Stories