English   

పుష్ప షూటింగ్ పై సుకుమార్ అనూహ్య నిర్ణయం

Pushpa
2021-02-16 11:52:20

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా "పుష్ప". ఈ సినిమాలో రశ్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో విలన్ పాత్రపై మాత్రం ఇంకా సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయ్ సేతుపతి డేట్స్ కారణంగా ఈ సినిమాలో నటించేందుకు నిరాకరించడంతో ఎంతోమంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం మంచు మనోజ్ పేరు కూడా వినిపిస్తోంది. ఇక చివరికి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. సుకుమార్ బన్నీ కాంబినేషన్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు ఆర్య, ఆర్య-2 సూపర్ హిట్ అవ్వడంతో "పుష్ప" సినిమా పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇదిలా ఉండగా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను అడవుల్లో చిత్రీకరిస్తున్నారు. అయితే మొదట షూటింగ్ కోసం సుక్కు థాయ్ ల్యాండ్ అడవులకు వెళ్లాలని అనుకున్నాడు. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల వెనక్కి తగ్గాడు. అనంతరం ఎక్కువ శాతం షూటింగ్ పార్ట్ ను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో జరిపారు. అయితే అక్కడ కూడా యూనిట్ సభ్యుడు కరోనా తో మరణించారు. దాంతో సుక్కు మిగిలిన షూట్ కోసం ఔట్ డోర్ వెళ్లాలని అనుకోవడం లేదట. హైదరాబాద్ లోనే అడవుల సెట్ వేసి షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని ఇప్పటికే నిర్మాతలకు కూడా చెప్పినట్టు సమాచారం.

More Related Stories