English   

భళా తందనాన అంటూ వస్తున్న శ్రీవిష్ణు

Sree Vishnu
2021-02-16 14:35:31

పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ నిజ జీవితానికి దగ్గరగా ఉండే సినిమాలు చేసి ప్రేక్షకాదరణ పొందిన హీరో శ్రీ విష్ణు. ఈ యంగ్ హీరో మరో క్రేజీ ప్రాజెక్టు తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాణం సినిమాను తెరకెక్కించిన చైతన్య దంతులూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి  " భలే తందనాన" అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రంలో కేథరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ విలన్ రామ చంద్ర రాజు విలన్ గా నటిస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి సినిమాను నిర్మిస్తున్నాడు. మణిశర్మ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాను ఈరోజు సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి అధికారికంగా లాంచ్ చేశారు. వచ్చే నెలలో ఈ చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇదిలా ఉండగా శ్రీవిష్ణు నటించిన గాలి సంపత్ సినిమా ఈ శివరాత్రికి విడుదల కానుంది.  అదే విధంగా శ్రీవిష్ణు నటించిన రాజ రాజా చోళ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

More Related Stories