English   

ఉప్పెన నాలుగో రోజు కలెక్షన్స్

Uppena
2021-02-16 16:29:30

మెగా మేనల్లు హీరోగా వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా "ఉప్పెన" ఈ సినిమాకు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి సినిమాలో విలన్ గా నటించాడు. చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్ బ్యానర్ పై నవీన్ యర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు. సినిమాకు దేవి  అందిచించిన సంగీతమే పబ్లిసిటీగా మారింది. ముఖ్యంగా నీ కళ్ళు నీలి సముద్రం పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇక సినిమా విడుదల రోజే కలెక్షన్ ల వర్షం కురిసింది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 20.05 కోట్లు జరిగింది. 

కాబట్టి బ్రేక్ ఈవెన్ సాదించాలంటే 21 కోట్ల షేర్ ను రాబట్టాలి. అయితే మూడు రోజులకే సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించింది. ఇక నాలుగో రోజు కూడా సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. నాలుగు రోజుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 30.11కోట్ల షేర్ ను రాబట్టింది. సోమవారం రోజు 4.17 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక నాలుగోరోజు కలెక్షన్లు ప్రాంతాలవారీగా చూస్తే  నైజాం - 1.35, సీడెడ్ - 82L, వైజాగ్ - 78L, ఈస్ట్ గోదావరి - 48L, వెస్ట్ గోదావరిL - 20.50L,కృష్ణ జిల్లా -25 L,గుంటూరు -34L, నెల్లూరు -15L, ఏపీ తెలంగాణ మొత్తం - 4.6 Cr ,కర్ణాటక - 25L,చెన్నై - 10L, ఓవర్శిస్ - 30L గా ఉన్నాయి. 
 

More Related Stories