English   

చిక్కుల్లో విశాల్ చక్ర... శుక్రవారం విడుదలవుతుందా..

Vishal Chakra
2021-02-16 18:20:19

విశాల్ హీరోగా నటించిన "చక్ర"  సినిమా ఈ శుక్రవారం ఫిబ్రవరి 19న విడుదల కావాల్సి ఉంది.  అయితే ఇప్పుడు ఈ సినిమా చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా రెండు రోజుల క్రిందటే ఈ చిత్రం రిలీజ్ పై హైకోర్ట్ స్టే ఇచ్చింది. దీనికి కారణం విశాల్ ఇదివరకు నటించిన "యాక్షన్" సినిమా కు లాస్ లు వచ్చాయట. అయితే సినిమాకు లాస్ లు వస్తే కొంత తాను కూడా భరిస్తానని విశాల్ యాక్షన్ సినిమా నిర్మాత రవీంద్రన్ తో ఒప్పందం కుదుర్చుకున్నారట. కానీ ఇంతవరకు ఆ డబ్బును విశాల్ చెల్లించకపోవడంతో నిర్మాత కోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్ట్ సినిమా విడుదలపై స్టే విధించింది. దాంతో విశాల్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు షాక్ అయ్యారు. ఇక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ, రెజీనా హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాను విశాల్ తన సొంత బ్యానర్ "విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ" బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

More Related Stories