English   

ఇకపై సాంప్రదాయంగా ఉంటానంటున్న బోల్డ్ పాప

Tejaswi Madivada
2021-02-17 11:03:01

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది తేజస్వి మడివాడ. ఈ సినిమా తరవాత చాలా సినిమాల్లోనే నటించింది. హీరోయిన్ ఫ్రెండ్ గా అల్లరి పిల్లగా పలు సినిమాల్లో అలరించింది. ఇక పక్కా తెలుగు అమ్మాయి అయినా తేజస్వి బోల్డ్ ఫోటో షూట్ లలో ముంబై హీరోయిన్ లకు ఏమాత్రం తక్కువ కాదు. అంతే కాకుండా బోల్డ్ సినిమాల్లోనూ నటించింది. వర్మ ఐస్స్క్రీమ్ సినిమాలో పక్కా బోల్డ్ గా కనిపించింది. అంతే కాకుండా ఓ వెబ్ సిరీస్ లోనూ బోల్డ్ క్యారెక్టర్ చేసింది. అయితే ఇదంతా గతం అంటుంది ఈ బ్యూటీ. ఇకపై అంతా సాంప్రదయ బద్ధంగానే కనిపిస్తుందంట..అలాంటి పాత్రలే చేస్తుందట. ఈ అమ్మడు ఇలాంటి షాకింగ్ డిసిషన్ ఎందుకు తీసుకుంది అనుకుంటుంన్నారా.? బోల్డ్ పాత్రలతో తనకు ఒరిగింది యేమి లేదట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెపుతోంది. అంతే కాకుండా ఇప్పటికే హాట్ ఫోటో షూట్ లకు కూడా పులిస్టాప్ పెట్టేసింది. అంతే కాకుండా సోషల్ మీడియాలోనూ పోస్ట్ లు తగ్గించింది. ఇక తనకు తానుగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఇన్ని రోజులు ఈ అమ్మడి ఫోటోలు చూసి ఫాలో అయ్యిన అభిమానుల పరిస్థితి ఎంటో మరి.

More Related Stories