గోపిచంద్ సినిమాలో వేశ్యగా అనసూయ

జబర్ధస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ ను ఇప్పుడు యాంకర్ అనే కంటే యాక్టర్ అనడమే బెటర్ ఏమో. ఎందుకంటే యాంకర్ కంటే ఇప్పుడు సినిమాల్లోనే అనసూయ బిజీగా వుంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూ..మరోవైపు ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ రచ్చ చేస్తోంది. ఇప్పటికే రవితేజ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక కార్తికేయ హీరోగా నటిస్తున్న "చావు కబురు చల్లగా" సినిమాలో ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేస్తోంది. ఇప్పటికే కార్తికేయ సినిమా నుండి అనసూయ ఫోటోలు కూడా భయటకు వచ్చి సెగలు పుటిస్తున్నాయి.
ఇక ఇప్పుడు అనసూయ గురించి మరో ఆసక్తికర టాపిక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. మారుతి దర్శకత్వంలో మాచో మ్యాన్ గోపీచంద్ ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో అనసూయ వేశ్య పాత్రలో నటించబోతుందట. అంతే కాకుండా సినిమాకు అనసూయ పాత్ర ఎంతో కీలకమని టాక్. సినిమా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కుతుండగా.
గోపిచంద్ లాయర్ గా నటించబోతున్నాడట. అయితే ఆ లాయర్ మనసు మార్చే పాత్రల్లోనే అనసూయ నటిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమానేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.