English   

నటుడిగా కాదు.. బాధితుడిగా ఇక్కడికొచ్చా.. జూనియర్ ఎన్టీఆర్

jr NTR
2021-02-17 21:59:28

హీరో జూనియర్ ఎన్టీఆర్ సైబరాబాద్ పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను  ప్రారంభించారు. ప్రస్తుతం జాతీయ రహదారి భద్రతా మాసం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు సీపీ సజ్జన్నార్ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిదిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.... "మా కుటుంబం ఇద్దరిని కోల్పోయింది. ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగా వాహనాలను నడిపే మా అన్న జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అలాగే 33 వేల కిలోమీటర్లు మా తాత ఎన్‌టీఆర్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ప్రమాదం జరగకుండా నడిపిన మా నాన్న హరికృష్ణ ఇదే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇంట్లోకి బయటికి వచ్చినప్పుడు దయచేసి కుటుంబ సభ్యులను గుర్తు తెచ్చుకోండి. మీ రాక కోసం ఎదురు చూసే వారిని గుర్తు తెచ్చుకోండి. శిక్షలు వేసినంత మాత్రాన మార్పు రాదు. 

బాధ్యతగా మనల్ని మనం మార్చుకున్నప్పుడే మార్పు వస్తుంది. పౌరులందరూ సన్మార్గంలో నడవాల్సిన అవసరం ఉంది. బాధ్యతారహితంగా పౌరులు ప్రవర్తించవద్దు. ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకుంటామో, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుకుంటామో అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి. పోలీసులు చేతిలో లాఠీ ఉంది దండించడానికో, శిక్షించడానికో కాదు మనల్ని సన్మార్గంలో నడిపించడానికి తల్లిదండ్రులను మనం ఎలా గౌరవిస్తామో పోలీసులను అదే విధంగా గౌరవించాలి." అంటూ ఎన్టీఆర్ పలు సూచనలు చేసారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరవాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా తరవాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. 
 

More Related Stories