English   

శంకర్ తో రామ్ చరణ్ పాలిటిక్స్

 Ram Charan
2021-02-18 10:35:22

ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ ఓ సినిమాలో నటిస్తున్నాడని ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. దర్శకుడు శంకర్ మరియు హీరో చరణ్ లు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చరణ్ ఆర్ఆర్ఆర్ పూర్తి చేసుకున్న తరువాత ఈ సినిమా షూటింగ్ పాల్గొనబోతునట్టు తెలుస్తోంది. మరోవైపు శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమాపై ఎటువంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉండగా చరణ్ శంకర్ సినిమా ఏ జోనర్ లో ఉండబోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఎక్కివగా భారీ విఎఫ్ఎక్స్ తో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కిస్తారు. అయితే చరణ్ తో మాత్రం శంకర్ ఓ పొలిటికల్ డ్రామా ను తియ్యబోతునట్టు సమాచారం. అంతే కాకుండా సినిమా లో ఎటువంటి విఎఫ్ఎక్స్ వర్క్స్ అవసరం లేకుండా చిత్రిస్తారట. కానీ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు మాత్రం లోటు ఉండదని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఇక శంకర్ రజినీకాంత్ తో శివాజీ సినిమాను తీశారు. ఈ సినిమా పొలిటికల్ డ్రామానే ఇది ఎంతపెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చరణ్ శంకర్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో చూడాలి.

More Related Stories