English   

రామ్ తో సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన లింగుస్వామి

 Ram Pothineni
2021-02-18 11:44:12

ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని లింగుస్వామి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా లింగు స్వామి ఈ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. లింగుస్వామి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎస్ ఎస్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ- తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రామ్ కెరీర్ లో 19వ సినిమాగా నిలవబోతోంది. ఇక ఈ సినిమాలో నటీనటులు, టెక్నీషియన్ ల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. 

అంతే కాకుండా ఈ సినిమా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ సినిమాగా ఉండబోతుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు. లింగు స్వామి విశాల్ తో తీసిన "పందెం కోడి" సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యింది. మరి రామ్ కు లింగు స్వామి ఎలాంటి హిట్ ఇస్తారో చూడాలి. ఇదిలా ఉండగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత రామ్ నటించిన రెడ్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టింది. దాంతో రామ్ జాగ్రత్తగా కథలు ఎంచుకుంటునట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు స్క్రిప్ట్ లకు కూడా రామ్ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.
 

More Related Stories