English   

విశ్వక్ సేన్ పాగల్ టీజర్ వచ్చేసింది

Vishwak Sen Paagal
2021-02-18 12:15:43

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన "ఈ నగరానికి ఏమైంది" సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన హీరో విష్వక్ సేన్. ఈ సినిమా కంటే ముందే విష్వక్ ఒక సినిమా చేసినప్పటికీ ఆ సినిమాతో పెద్దగా గుర్తింపురాలేదు. ఇక ఈఎన్ఈ తరవాత  విష్వక్ గ్యాప్ లేకుండా సినిమాలు తీసాడు. సొంత డైరెక్షన్ లో లో తీసిన ఫలక్ నమా దాస్ సినిమాతో మాస్ కా దాస్ అనే పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరవాత "హిట్" సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. 

ఇదిలా ఉండగా విష్వక్ సేన్ నటిస్తున్న తాజాగా చిత్ర "పాగల్" టీజర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు నరేష్ కుల్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తమిళం లో సూపర్ హిట్ అయిన "ఓ మై కడవులే" సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన టీజర్ విషయానికొస్తే విష్వక్ రిమాంటిక్ యాక్షన్ లుక్ లో కనిపిస్తున్నాడు. సినిమాలో రేవుమాంటిక్ మరియు ఫైట్స్ తో పాటు కామెడీ కూడా ఉండబోతుందని తెలుస్తోంది.
 

More Related Stories