English   

కొత్త జంటకు ప్రభాస్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్

Prabhas
2021-02-18 14:42:11

టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడయ్యాడు. ఫిబ్రవరి 13న సమీప బంధువు దీపికా మెడలో తాళి కట్టి సుమంత్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. అయితే కరోనా కారణంగా బంధువులు, సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరిగింది. దాంతో టాలీవుడ్ సెలబ్రెటీలు పెళ్లికి హాజరవ్వలేకపోయారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ కపుల్ కు విషెస్ చెబుతున్నారు. అయితే తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ సుమంత్ అశ్విన్ పెళ్లికి స్పెషల్ గిఫ్ట్ లు పంపి సర్ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని సుమంత్ అశ్విన్ తండ్రి నిర్మాత ఎమ్.ఎస్  రాజు సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రభాస్.. సుమంత్ అశ్విన్ దీపికా ల పెళ్లికి గిఫ్ట్ పంపించారని ..థాంక్యూ డార్లింగ్ అని ఎమ్.ఎస్ రాజు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ గిఫ్ట్స్ లో ఒక బొకే తో పాటు కొత్త జంటకు పట్టు వస్త్రాలు పంపించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్ రాజు కు ప్రభాస్ కు ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాలు వర్షం, పౌర్ణమి సినిమాలను ఎమ్ ఎస్ రోజునే నిర్మించారు.

More Related Stories