English   

ఈ సారి బుల్లెట్ దింపేస్తా బ్రదర్..మహేష్ సినిమాపై తమన్ కామెంట్

Thaman
2021-02-18 17:28:01

ప్రస్తుతం ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుల్లో యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఒకరు. తమన్ అల వైకుంఠ పురం సినిమాకు ఇచ్చిన పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి. అంతే కాకుండా ఈ పాటలను విదేశీ క్రికెటర్లు కూడా ఎంజాయ్ చేస్తూ టిక్ టాక్ లు చేశారు. దాంతో పాటలకు మరింత హైప్ పెరిగింది. కొన్ని సార్లు తమన్ పాటలపై ట్రోల్స్ వచ్చినా వాటిని పట్టించుకోకుండా తన సినిమాలకు న్యాయం చేస్తుంటాడు. మాస్ పాటలు అయినా క్లాస్ పాటలు అయినా తమన్ మ్యూజిక్ కు ప్రత్యేకత ఉంటుంది. 

ఇదిలా ఉండగా తాజాగా ఓ అభిమాని సోషల్ మీడియాలో "సర్కారు వారి పాట" సినిమాపై అప్డేట్ ఇవ్వాలని కోరగా తమన్ స్పందిస్తూ..మొదటి సాంగ్ ను ఆగస్టు లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. అంతే కాకుండా బ్రదర్ మనకు చాలా టైం ఉంది కానీ బులెట్ పక్కా దింపేద్దాం. ఈసారి అదే ఫిక్స్ అయ్యా మళ్ళీ ఆగస్టులో కలుద్దామని తమన్ సమాధానం ఇచ్చారు. తమన్ రీప్లే తో మహేష్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక తమన్ జోష్ చూస్తుంటే మహేష్ బాబు "సర్కారు వారి పాట" సినిమాకు బాక్సు బద్దలు కొట్టేలా ఉన్నారు. మరి అల వైకుంఠ పురం రికార్డులను సర్కారు వారి పాటతో తానే బ్రేక్ చేస్తారా లేదా చూడాలి.

More Related Stories