English   

తమిళ స్టార్ హీరో తనయుడి కోసం ఉప్పెన

Vijay
2021-02-18 17:32:13

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాకు అన్ని వర్గాల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఐదోరోజు కూడా ఈ సినిమా 3.92 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. సినిమా ఘన విజయం సాధించడంతో  సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అంతే కాకుండా ఈ సినిమా రీమేక్ తో తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రయత్నాలు మొదలు పెట్టారట. విజయ్ తన కొడుకు జాసన్ సంజయ్ ని రెండేళ్లుగా లాంచ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలను విజయ్ కొట్టి పారేస్తూ వస్తున్నారు. 

కానీ ఇప్పుడు మాత్రం విజయ్ ఒక మంచి సినిమాతో తన కొడుకుని లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగులో సూపర్ హిట్ అయిన ఉప్పెన రీమేక్ తో ఎంట్రీ ఇప్పిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. అయితే విజయ్ ఇప్పటి వరకు సినిమాను చూడలేదు కానీ ఉప్పెన గురించి విజయ్ చాలా మంది చెబుతుంటే విన్నారట. ఇక తమిళ హీరో విక్రమ్ కూడా తన కుమారుణ్ణి తెలుగులో సూపర్ హిట్ అయిన "అర్జున్ రెడ్డి" సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు. ఈ సినిమాతో ధృవ్ కి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో విజయ్ కూడా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన "ఉప్పెన" రీమేక్ తో పరిచయం చేయబోతునట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇది ఎంతవరకు నిజమవుతోందో చూడాలి.

More Related Stories