English   

అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి మెగాస్టార్ ఆర్ధిక సహాయం

Chiranjeevi
2021-02-19 00:35:21

మెగాస్టార్ చిరంజీవి అనారోగ్యంతో బాధ పడుతున్న తన అభిమాని వెంటనే కోలుకోవాలంటూ లక్ష రూపాయల సాయం అందించారు. కడపకు  చెందిన  సీనియర్ మెగా అభిమాని పి సురేష్ అంటే తెలియని మెగాభిమానులుండరు. అఖిల భారత చిరంజీవి యువతకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన కడప జిల్లా మాజీ అధ్యక్షుడిగా ఎనలేని సేవలు చేసారు. మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణం కన్నా మిన్నగా అభిమానించే ఆయన చిరంజీవిగారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేసారు. ప్రస్తుతం సురేష్ అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు  పడుతూ కదిరిలో ఉంటున్నారు. 

చికిత్స నిమిత్తం ప్రతి రెండ్రోజులకోసారి కదిరి నుండి కడప, తిరుపతి వెళ్తూ వస్తున్నారు. కాగా తీవ్ర అనారోగ్యంతో, ఆర్థికంగా సతమతమవుతున్న సురేష్ కి మెగాస్టార్ సాయం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున పి సురేష్ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసారు. గురువారం మధ్యాహ్నం పి సురేష్ అకౌంట్ కు లక్షరూపాయలను ట్రాన్స్ఫర్ చేసారు. ఈ ఘటనతో ఆపదలో ఉన్నవాళ్లను రక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడూ ముందుంటారని మరోసారి రుజువైంది. కరోనా సమయంలో కూడా అయన ఎందరో అభిమానులకు తనదైన సపోర్ట్ అందించారు. ఈ సందర్బంగా అఖిల భారత చిరంజీవి యువత మెగాస్టార్ చిరంజీవి గారికి కృతఙ్ఞతలు తెలిపారు.

More Related Stories