English   

మోహన్ బాబుకు షాక్ ఇచ్చిన మున్సిపల్ అధికారులు

Mohan Babu
2021-02-19 10:59:08

టాలీవుడ్ ప్రముఖ నటుడు కెలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. మున్సిపల్ అధికారులు ఏంటి మోహన్ బాబుకు షాక్ ఇవ్వడమేంటి అని అనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి. మోహన్ బాబు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే తన నివాసం ముందు మోహన్ బాబు ఒక భారీ అడ్వటైజింగ్ బోర్డు ను ఏర్పాటు చేశారు. ఆ బోర్డును భారీ ఎల్ఈడీ లైట్స్ తో ఏర్పాటు చేశారు. కాగా జీహెచ్ఎమ్సి అధికారుల నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా మోహన్ బాబు బోర్డు ఏర్పాటు చేసిందున మున్సిపల్ అధికారులు నోటీసులు పంపించారు. మొత్తం లాక్ష రూపాయల జరిమానా విధిస్తూ అధికారులు నోటీసులు పంపించారు. అయితే మోహన్ బాబుకు ఫైన్ వెయ్యడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. ఇదిలా ఉండగా మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.
 

More Related Stories