రవితేజ హీరోయిన్ వయస్సు అంత తక్కువా

ఒకప్పుడు హీరోలకు సగం వయస్సు ఉన్న హీరోయిన్ లతో రొమాన్స్ చేయడం కామనే. సగం వయస్సే కాకుండా హీరో వయస్సులో మూడో వంతు వయస్సు ఉన్న హీరోయిన్ లతోను రొమాన్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చేస్తే ప్రేక్షకులు ఒప్పుకునేలా కనిపించడం లేదు. హీరో వయస్సు కంటే హీరోయిన్ భాగా చిన్నదైతే ట్రోల్స్ దాడికి గురవ్వాల్సిందే. ఇక ఇప్పుడు రవితేజ కూడా అలాంటి రిస్కె చేస్తున్నట్టు కనిపిస్తోంది. క్రాక్ హిట్ తో రవితేజ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖిలాడి సెట్స్ పై ఉండగా.. నక్కిన త్రినాధ రావు దర్శకత్వంలో ఓ సినిమాకు ఒకే చెప్పాడు. అయితే ఈ సినిమాలో రవితేజ తో రొమాన్స్ చేసే ఇద్దరు హీరోయిన్ వయస్సు భాగా తక్కువట. సినిమాలో తమిళ హీరోయిన్ ఐష్వర్య మీనన్ తో పాటు శ్రీ లీల నటిస్తున్నట్టు. వీరిలో ఐష్వర్య వయస్సు పాతికేళ్ళు కాగా..శ్రీ లీల వయస్సు 19 ఏళ్ళు అంటే రవితేజ వయసులో మూడో వంతు. మరి స్క్రీన్ పై ఈ జోడీలను చూసి యాక్సెప్ట్ చేస్తారా...లేదంటే ట్రోల్స్ మొదలు పెడతారా చూడాలి.