English   

పాత బస్తీ పహిల్వాన్ లతో పవన్ ఫైట్

pawan kalyan
2021-02-24 12:33:42

పవర్ స్టార్ క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు "హరి హర వీరమల్లు" అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే పవన్ నటిస్తున్న సినిమాల నుండి రోజుకో అప్డేట్ వస్తున్నా క్రిష్..పవన్ సినిమా పై మాత్రం పెద్దగా వార్తలు రావడంలేదు. నిజానికి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమాను రెండు దశాబ్దాల వెనకటి కథామషం నేపథ్యంలో తెరకెక్కిఅతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను హైదరాబాద్ శివార్లలో ప్రత్యేక సెట్స్ లో జరుపుతున్నారు. చిత్రీకరణ కోసం చార్మినార్ సెట్ ను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ షూటింగ్ లో పవన్ పాత బస్తి పహిల్వాన్ లతో తలపడనున్నారు. ఈ ఫైట్ సీన్ సినిమాలోనే హైలెట్ గా నివబోతునట్టు సమాచారం. ఇక మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న పవన్ పహిల్వాన్ లతో ఎలా తలపడుతాడో అన్న ఆసక్తి మొదలయింది. ఇదిలా ఉండగా పాత బస్తి పహిల్వాన్ లకు ఎంతో చరిత్ర ఉంది. పాత బస్తీలో కొన్ని కుటుంబాలు కుస్తీనే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఇక సెట్స్ లో పవన్ పహిల్వాన్ లతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More Related Stories