English   

హైదరాబాద్ రోడ్లపై అజిత్ సైక్లింగ్...ఫోటోలు వైరల్

Thala Ajith
2021-02-26 11:55:45

తమిళ స్టార్ హీరో అజిత్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ యాక్షన్ సినిమాలతో బీభత్సమైన ఫాలోయింగ్ ను అజిత్ సొంతం చేసుకున్నాడు. మొదట్లో ప్రేమ కథ చిత్రలతో లవర్ బాయ్ గా అలరించిన అజిత్ ఇప్పుడు మాత్రం మాస్ యాక్షన్ సినిమాలతో అలరిస్తున్నాడు. అజిత్ కు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉండటం అజిత్ సినిమాలన్నీ తెలుగులోను రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే అజిత్ బైక్ తో దేశం లోని ముఖ్యమైన ప్రదేశాలను చుట్టిరాగా తాజాగా మరో అడ్వెంచర్ చేసాడు. హైదరాబాద్ రోడ్లపై సైక్లింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి అజిత్ రామోజీ ఫిల్మ్ సిటీ వరకు సైకిల్ తొక్కాడు. అజిత్ కలిసి సైక్లింగ్ చేసిన వాళ్ళు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడంతో అజిత్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అజిత్ ప్రస్తుతం "వాలిమై" సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా షూటింగ్ గ్యాప్ లో అజిత్ అలా సరదాగా సైక్లింగ్ చేయడంతో ఇప్పుడు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

More Related Stories