English   

శ్రీవిష్ణు గాలి సంపత్ ట్రైలర్ టాక్

 Gaali Sampath
2021-02-27 11:33:15

యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న సినిమా "గాలి సంపత్". ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ శ్రీవిష్ణు తండ్రిగా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనిష్ దర్శకత్వంలో ఎన్ కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావి పూడి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక తాజాగా ముందుగా ప్రకటించిన విధంగా ఈ సినిమా టైలర్ ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా 10గంటల 35 నిమిషాలకు విడుదల చేసారు. కాగా సినిమా ట్రైలర్ ఎమోషనల్ కామెడీ తో మిక్స్ చేసిన ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. ట్రైలర్ లో కమెడియన్ సత్య కామెడీ..రాజేంద్రప్రసాద్ శ్రీవిష్ణు మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. అంతే కాకుండా టైలర్ లో వచ్చిన డైలాగులు బాగున్నాయి. మరోవైపు హీరో హీరోయిన్ ల మధ్య లవ్ ఎమోషనల్ సీన్లు కూడా అలరిస్తున్నాయి. ఇక అన్ని ఎమోషన్స్ కలగలిపిన మిశ్రమంలా గాలి సంపత్ ట్రైలర్ ఉంది.  శ్రీ విష్ణు సినిమాలంటే రియాలిటీకి ఎంతో దగ్గరగా ఉంటాయి. గాలి సంపత్ సినిమా కూడా రియాలిటీ కి దగ్గరగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ సినిమా మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

More Related Stories