English   

సంక్రాంతికి సూపర్ స్టార్ వర్సెస్ పవర్ స్టార్

Mahesh Babu Pawan Kalyan
2021-03-01 13:40:11

ప్రతి ఏడాది సంక్రాంతి సినిమాలకు మాములు క్రేజ్ ఉండదు. సంక్రాంతి పండక్కి సినిమాలు విడుదల చేయడానికి పోటీ పడుతుంటారు. అయితే ఒక నాలుగు లేదా ఐదు నెలల ముందు సినిమా రిలీజ్ డేట్ లను ప్రకటిస్తారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను సంక్రాంతి కి విడుదల చేస్తుండటం..ఆ రిలీజ్ డేట్ లను ఇప్పుడే ప్రకటించడం ఆసక్తి కలిగిస్తుంది. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్..అటు సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ హీరోల సినిమాలు వచ్చాయంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం ఖాయం. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్స్ రంగంలోకి దిగితే ఎలా ఉండదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు(టైటిల్ ఫిక్స్ చేయలేదు) కూడా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. మహేష్ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా...పవన్ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా..పవన్ కళ్యాణ్ పక్కన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇద్దరు స్టార్ హీరోలు సంక్రాంతికి వస్తుండటం పై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మా హీరో సత్తా చాడుతాడు..అంటే మా హీరో కలెక్షన్స్ కొల్లగొడుతాడు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరి ఏ హీరో సత్తా చాటుతాడో తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.

More Related Stories