English   

భీష్మ దర్శకుడికి షాక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు

bheeshma
2021-03-02 09:23:58

రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సాధారణ ప్రజలనే ముకుంద కేటుగాళ్ళు ప్రముఖులను సైతం టార్గెట్ చేసి డబ్బులు గుంజుతున్నారు. తాజాగా సినిమా డైరెక్టర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడం కలకలం రేవుతోంది. భీష్మ దర్శకుడు వెంకీ కుడుములు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. వెంకీ దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమాకు పలు అవార్డులు వచ్చయంటూ ఓ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. రెండు రోజుల క్రితం ఫోన్ చేసిన కేటుగాడు భీష్మ సినిమా అంతర్జాతీయ చిత్రోత్సవానికి, పురస్కారాలు ఎంపికైందని చెప్పాడు. ఏయే విభాగాల్లో ఎపికైంది అన్నది కూడా వివరించాడు. ప్రాసెసింగ్ నిమిత్తం ఒక్కో విభాగానికి 10 చొప్పున మొత్తం 63 వేలు చెల్లించాలని చెప్పాడు. దాంతో మోసాగాడిని నమ్మిన డైరెక్టర్ డబ్బులను ట్రాన్స్ఫర్ చేసాడు. డబ్బులు పంపిన అనంతరం తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

More Related Stories