English   

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..పుష్ప టీజర్ వచ్చేది అప్పుడే

Allu Arjuns Pushpa
2021-03-02 14:18:09

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ సినిమాను గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో బన్నీ సరసన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సినిమాలోని  అర్థభాగం వరకు ఏపీలో రంప చోడవరం, హైదరాబాద్ లో చిత్రించగా ప్రస్తుతం షూటింగ్ కోసం టీమ్ తమిళ నాడు వెళ్ళింది. అక్కడ సినిమాలోని పుష్ప రాజ్ కుటుంబం పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్ లు ఇంట్రెస్టింగ్ గా ఉండటం తో సినిమా టీజర్ ఎప్పుడు విడుదల అవుతుందని అల్లు అర్జున్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాగా బన్నీ బర్త్ డే ఎప్రిల్ 8 సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే సినిమా విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 23న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

More Related Stories