English   

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో

Naveen Polishetty
2021-03-02 18:04:20

ప్రస్తుతం ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెంచాడు. ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు..చౌడప్ప నాయుడు అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా సినిమాను రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. 

అయితే తాజాగా ఈ సినిమాపై మరో అప్డేట్ వచ్చింది. అదేంటంటే సినిమాలో ఓ కీలక పాత్రలో టాలీవుడ్ కు ఈ మధ్యే పరిచయం అయిన హీరో నటించబోతున్నాడట. అతనెవరో కాదు నవీన్ పొలిశెట్టి. నిజానికి నవీన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసాడు. ఆ తరవాత మళ్ళీ కనిపించలేదు. కానీ ఇటీవల విడుదలైన "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ" సినిమాతో టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ప్రస్తుతం నవీన్ నటించిన "జాతి రత్నాలు" సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి జాక్ పాటు కొట్టేసాడు.

More Related Stories