English   

ముంబై లో పలువురు బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు

Tapsee Pannu
2021-03-03 15:40:59

బాలీవుడ్ కలకలం రేగింది. హీరోయిన్ నిర్మాత, దర్శకుడి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ప్రముఖ హీరోయిన్ తాప్సి పన్ను, నిర్మాత మధు వర్మ మంతెన తో పాటు దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇళ్లల్లో మరియు కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఆదాయ పన్నులు పన్నులు ఎగ్గొడుతున్నారన్న సమాచారం తో అధికారులు రంగంలోకి దిగి దాడులు చేస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాత వికాస్ బుల్ ఫాంటమ్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఐటి రైడ్స్ వ్యవహారం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా తాప్సి టాలీవుడ్ లో జుంమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇవ్వగా...ప్రస్తుతం బాలీవుడ్ ఫుల్ బిజీగా మారింది. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

More Related Stories