English   

ఏనుగులతో గడపడం వల్ల.. మనుషులతో నా రిలేషన్‌ బలపడింది : రానా దగ్గుబాటి

Rana Daggubati
2021-03-04 16:01:18

దగ్గుబాటి హీరోగా విష్ణు విశాల్‌, శ్రియ పిల్గావోంక‌ర్, జోయా హుస్సేన్‌ ముఖ్య పాత్రదారులుగా ప్రముఖ దర్శకుడు ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన చిత్రం అర‌ణ్య‌. ఈరోస్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మార్చి 26న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. ఈ కార్యక్రమంలో హీరో రానా, దర్శకుడు ప్రభు సాల్మన్, హీరోయిన్స్ శ్రియ పిల్గావోంక‌ర్, జోయా హుస్సేన్, నటుడు విష్ణు విశాల్, ఈరోస్ ప్రతినిధి నందు ఆహుజా పాల్గొన్నారు. 

హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్ళ తరువాత 'అరణ్య' సినిమా వస్తుంది. ప్రభు సాల్మన్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది.  ఈ చిత్రంలో అరణ్య క్యారెక్టర్ ప్లే చేశాను.. ప్రభు సాల్మన్ స్టయిల్ లోనే ఈ చిత్రం ఉంటుంది. ‘మనం ఎక్కడి నుంచి వచ్చామో.. అక్కడికి వెళ్లిపోతాం. ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్లలేం’ అనేది అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని నాకు ఏనుగు మరోలా చెప్పింది. ‘ఈ ప్రకృతిలో నువ్వు ఒక భాగం. ఆ భూమిని నువ్వు చూసుకుంటే.. అది నిన్ను మళ్లీ చూసుకుంటుంద’ని. సిటీ, టౌన్ లో పుట్టిపెరిగిన ఓ కుర్రాడు ప్రకృతికి, మనుషులకు జరిగిన పోరాటంలో ఏనుగులను రిప్రజెంట్ చేస్తూ.. వాటిని ఎలా కాపాడాడు అనేది మెయిన్ కాన్సెప్ట్.

ప్రభుతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియెన్స్ నిచ్చింది. ఆయనది ఒక సెపరేట్ స్కూల్. అనుకున్న సీన్ వచ్చేదాకా తను ఎన్ని టేక్ లైనా తీస్తాడు. థియేటర్స్ లో ప్రేక్షకులకు మనం చెప్పే కథ నచ్చకపోతే వెంటనే లేచి వెళ్లిపోతాడు. అందుకని వారికి నచ్చే సీన్స్ చేయాలి అని ప్రభు చెప్తుంటాడు.. ఆయనలో నాకు బాగా నచ్చిన విషయం ఇది. నాకింత మంచి చిత్రం ఇచ్చినందుకు ప్రభుకు థ్యాంక్స్‌.  నేను చేసిన ప్రతి సినిమా నుంచీ ఏదోక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాను.

ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చింది. అడవిలో ఉండటం.. ఏనుగులతో గడపడం వల్ల మనుషులతో నా రిలేషన్‌ మరింత బలపడింది. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్ మూడు భాషల్లో చేశాం. గతేడాదే చిత్రీకరణ పూర్తయింది. చాలా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ, ఈ చిత్రాన్ని  థియేటర్లలోనే చూపించాలన్న ఉద్దేశంతో ఈరోస్ నిర్మాతలు ఏడాది పాటు వెయిట్ చేసి మార్చి 26న వరల్డ్ వైడ్ గా బిగ్ రిలీజ్ చేస్తున్నారు. వాళ్లకి నా స్పెషల్ థ్యాంక్స్‌".. అన్నారు. 

"ప్రభు, రానా కాంబినేషన్లో వస్తోన్న 'అరణ్య' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 26న అత్యధిక స్క్రీన్స్ లలో రిలీజ్ చేస్తున్నాం. బిగ్ స్కేల్ లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా తెలుగు, హిందీ, తమిళ్ త్రీ లాంగ్వేజెస్ లో నిర్మించాం.. గ్యారెంటీగా ఈ చిత్రం ఆడియెన్స్ కి నచ్చుతుంది" అన్నారు.

More Related Stories