English   

వంద వంద వేసుకుని తాగేవాళ్లం..అలాంటి ప‌నులు చేశాం : విజ‌య్ దేవ‌ర‌కొండ

Vijay Devarakonda
2021-03-08 13:09:37

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ వరంగ‌ల్ లో ఏర్పాటు చేసిన జాతిర‌త్నాలు ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఛీఫ్ గెస్ట్ గా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వ‌రంగ‌ల్ కు రావ‌డం వ‌ల్ల ఇంత మందిని కలిసే అవకాశం వచ్చిందన్నారు. ఏడాది నుంచి మీ అందరినీ చూడలేదు.. ఈరోజు నేను నటుడిని కాలేకపోయినా ఇక్కడకి వచ్చేవాడిని.. మీలా అక్కడ కూర్చుని చూసేవాడిని.. యాక్టర్‌ని అయ్యాను కాబట్టి ఇక్కడ నిల్చున్నా. లాక్డౌన్ సమయంలో భయం వేసింది..ఈ ప్యాండమిక్‌లో మళ్లీ సినిమాలకు వస్తారా.. చూస్తారా అని మేమంతా మాట్లాడుకున్నాం. మీరు మాకెంత ముఖ్యమో ఈరోజు తెలుస్తోంది. సినిమా అంటే ఒక ఎకానమీ.. ఓ డైరెక్టర్ కథ రాస్తే.. నిర్మాత ఓకే చేసి. హీరో సైన్ చేస్తే..  యాక్టర్ స్టాఫ్.. లైట్స్ మెన్.. మ్యూజిక్ డైరెక్టర్.. మ్యూజిషియన్స్.. డ్రైవర్లు,  క్యాస్టూమ్ డిజైనర్లు ఇలా అందరూ సినిమా మీద ఆధారపడి ఉన్నాం.. బాంబేకి వెళ్లినా అక్కడి వారు మన గురించి మాట్లాడతారు. తెలుగు ఆడియెన్స్ టూ మచ్ అబ్బా.. ఏం సినిమాలు చూస్తారు.. ఎంత ప్రేమిస్తారని అంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారు.. ఈవెంట్ అని చెబితే వేల మంది వస్తారు.. మా గురించి తిక్క తిక్కగా మాట్లాడితే కొట్లాడతారు అని చెబుతాను. నేను మిడిల్ క్లాస్ ఫండ్ అంటే మీరే వచ్చి చేశారు.. బర్త్ డే ట్రక్ ఐదు రాష్ట్రాల్లో చేద్దామంటే.. మీరు వచ్చి అన్ని రాష్ట్రాల్లో చేస్తామని అన్నారు..ఇన్ని సినిమాలు, ఇన్ని హిట్లు.. ఇన్ని ప్యాన్ ఇండియా అనౌన్స్‌మెంట్లు.. ఇంత క్రౌడ్ ఎక్కడైనా ఉంటుందా? 

తెలుగు వాళ్లను బీట్ చేసే ఆడియెన్స్. ఫ్యాన్స్ ఎక్కడా లేరు.. కాలర్ ఎగరేసి చెబుతున్నా.. ఈ రోజు ఈ అవకాశాన్ని ఉపయోగించి ఇది చెప్పాలని అనుకున్నాను. ఇక్కడున్న వారంతా నా ఫ్రెండ్స్. నా జీవితంతో ఏదో ఒకలా ప్రతీ ఒక్కరూ ముడిపడి ఉన్నారు.. కలిసి కలలు కన్నాం.. కష్టాలు చెప్పుకున్నాం.. నవ్వించారు.. ధైర్యమిచ్చారు..వంద వంద వేసుకుని తిన్నాం తాగాం.. దర్శిలేకపోతే పెళ్లి చూపుల్లో ప్రశాంత్ లేడురా.. దర్శి ఇప్పుడు అన్ని ఫ్లాట్‌ఫాంలో చేస్తున్నాడు..ప్రతీ రోజూ బిజీగా ఉంటున్నాడు.. శివ లేకపోతే అర్జున్ లేడు. రాహుల్ రామకృష్ణను నటుడిగా నిన్ను ఎప్పుడూ గౌరవిస్తాను.. ఆరేళ్ల క్రితం.. నువ్ హీరోగా నిలబడుతావ్.. మన ముందు ఓ 25 వేల మంది ఉంటారు.. మనం మాట్లాడతామని అనుకుంటే నవ్వుకునేవాళ్లం.. కానీ ఇంటికెళ్లి ఇదే  కలలు కనేవాళ్లం.. పడుకునే వాళ్లం కాదు.. మేం అంతా కలిసి థియేటర్ చేసే వాళ్లం.. నేను నవీన్ ఒక గ్రూపులో.. దర్శి, రాహుల్ మరో గ్రూపులో కలిసి నటించేవాళ్లు.. ఆరేళ్ల క్రితం కూడా ఇదే టాలెంట్ ఉంది.. టైం ఇప్పుడు వచ్చింది..  ఇక్కడున్నాం.. గుర్తుండిపోయే జర్నీ ఇస్తాం..

నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణం నాగ్ అశ్విన్.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చేసేటప్పుడు చిన్న చిన్న రోల్స్ ఇచ్చేవాడు.. యాడ్ ఫిల్మ్ చేస్తే నన్ను పెట్టుకున్నాడు.. ఎవడే సుబ్రహ్మణ్యంలో కొట్లాడి మరీ రోల్ ఇచ్చాడు. నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం నాగీ. ఇలా ఉండు అలా ఉండు.. అందరిలా ఉండు అనే వాడు కాదు.. నీలా ఉండు అని చెప్పేవాడు.. ఫస్ట్ ప్రమోషన్స్‌కి వెళ్లేటప్పుడు గుర్తుండిపోయే మెమోరీ ఇవ్వమని నాగీ చెప్పాడు. ఇప్పటికీ అదే గుర్తు పెట్టుకున్నాం.. మధ్య మధ్యలో అనుదీప్ షార్ట్ ఫిలిమ్ చూపించి నవ్వించేవాడు.. ఫరియా ఎంతో ఎనర్జీతో నటించావ్.. నీ జర్నీ కూడా మాలానే మొదలైందని విన్నాను. మా అందరి కంటే మంచి నటిలా ఉన్నావ్.. మా మొదటి సినిమాలో నీ అంత యాక్టింగ్ చేయలేదు.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నన్ను నటుడిగా వైజయంతీ మూవీస్ లాంచ్ చేసింది.. ఇలా ఫ్రెండ్స్ అందరితో స్టేజ్ షేర్ చేసుకోవడం.. కన్న కలలన్నీ కూడా నిజం కావడం ఎంతో గొప్పగా ఉంది..  మార్చి 11న జాతి రత్నాలు.. వెళ్లండి.. చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

More Related Stories