English   

మార్చ్ లో విడుదలకు రెడీగా ఉన్న సినిమాలు ఇవే

Tollywood
2021-03-09 12:40:49

మార్చ్ నెలలో 25కు పైగా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మార్చ్ నెలలో 11, 12,19, 26,27 వ తేదీల్లో ఈ సినిమాలు విడుదల కానున్నాయి. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు మార్చ్ లో విడుదలకు క్యూ కట్టాయి. మార్చ్11 న గాలి సంపత్, శ్రీకారం, జాతిరత్నాలు, లవ్ లైఫ్ పకోడీ, పైసా పరమాత్మ, రూహి,  రాబర్ట్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో గాలిసంపత్, జాతి రత్నాలు, శ్రీకారం సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇక మార్చ్ 19న కూడా ఎక్కువ సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. చావు కబురు చల్లగా,  మోసగాళ్ళు, సిండ్రిల్లా, ఇదే మా కథ, మయూరాక్షి, ఇది కళ కాదు, సందీప్ ఔర్ పింకీ పహర్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో మోసగాళ్ళు, చావు కబురు చల్లగా సినిమాలపై అంచనాలున్నాయి. ఇక మార్చ్ 26 న రంగ్ దే, అరణ్య, హౌస్ అరెస్ట్, సైనా, సర్వం సిద్ధం, డీ కంపెనీ, వివహాబోజనంబు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో రంగ్ డే, అరణ్య సినిమాలపై అంచనలున్నాయి. అంతే కాకుండా మార్చ్ 27 న తెల్లరితే గురువారం సినిమా విడుదల కాబోతుంది. మొత్తానికి పాతిక పైగా సినిమా లతో మార్చ్ లో బాక్స్ ఆఫీసు వద్ద పండగ వాతావరణం కనిపించనుంది.

More Related Stories