English   

బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రభాస్ మల్టీస్టారర్

Prabhas
2021-03-09 15:43:51

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టు లతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా జులై 30న విడుదల కానుంది. ఇక ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో సినిమా సలార్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా 2022 ఎప్రిల్ 14న విడుదల కానుంది. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా 2022 ఆగస్ట్ 11 న రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పుడు ప్రభాస్ మరో భారీ బడ్జెట్ సినిమా చేయబోతునట్టు వార్తలు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. 

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పూర్తయ్యాక బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ లో నటిస్తారట. ఈ చిత్రాన్ని వార్, బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని కూడా భారీ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మాణ సంస్థ నిర్మించనుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్టు తెలుస్తోంది.
 

More Related Stories