English   

చివరి షెడ్యూల్ లో తెలిసినవాళ్ళు

hebah patel
2021-03-09 16:05:49

సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న " తెలిసినవాళ్ళు" .  విభిన్న కథాంశంతో రొమాన్స్ - ఫ్యామిలీ - థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా అతని సరసన అంటే ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ పాత్రలో హీబా పటేల్ తన సినీ కెరీయర్ లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు.  ముఖ్య పాత్రలలో సీనియర్ నరేష్,  పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ ఉండగా ఇతర ముఖ్య పాత్రలలో యువ నటులు , టెక్నీషియన్స్ గా ఫిలిం స్కూల్ గ్రాడ్యుయేట్లు కలిగిన ఈ చిత్రం అత్యున్నత ప్రామాణాలతో దాదాపుగా ఎనభై శాతం పూర్తయ్యింది.  ఆఖరి షెడ్యూల్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి.

More Related Stories