బాడీ షేమింగ్ పై ఇలియానా షాకింగ్ కామెంట్స్

బోల్డ్ గా మాట్లాడే హీరోయిన్ లలో ముందువరుసలో ఉంటుంది గోవా బ్యూటీ ఇలియానా. దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు తెరకు కొత్త అందాలను పరిచయం చేసింది. ఈ అమ్మడి ఫిట్నెస్ చూసి అప్పటి టాలీవుడ్ భామలంతా కుల్లుకున్నారు. ఇక ఈ భామ ఎక్కువగా బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. టాలీవుడ్ లోనూ సినిమాలు చేయడానికి రెడీ గా ఉన్నప్పటికీ ఒకప్పటిలా ఆఫర్లు వెతుక్కుని వెళ్లే పరిస్తితి ఇప్పుడు కనిపించడంలేదు.
ఇదిలా ఉండగా తన ఫిట్నెస్ తో అందర్మీ ఆశ్చర్యపరిచిన ఇలియానా తాజాగా బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. బాడీ డిస్మార్ఫియా అనే ఫోబియా గురించి మాట్లాడిన ఇలియానా....తాను ఒకప్పుడు ఆ ఫోబియాతో బాధపడేదాన్నని చెప్పింది. అమ్మాయిలు తమ శరీరంలో అన్ని భాగాలు సరైన కొలతలతో ఉన్నా..తమ శరీరంలో శరీర భాగాలు సరైన కొలతల్లో లేవని భావించడమే బాడీ డిస్ మార్పియా అంటారు. అయితే మొదట్లో తాను ఈ ఫోబియాతో బాధపడ్డానని కానీ ఇప్పుడు తన శరీరం పట్ల గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పింది. మొదట్లో తనది హీరోయిన్ కు పనికి వచ్చే ఫిగర్ కాదని విమర్షించేవారని చెప్పింది. వక్షోజాలు చిన్నగా ఉన్నాయని సినిమాలకు పనికిరావని హేళన చేసేవారని తన ఆవేదనను చెప్పుకుంది. ఇక ఇప్పుడు మాత్రం ఈ భామ తన అందాలతో కుర్రాళ్ళ మతిపోగోతోంది.