English   

దేత్త‌డి హారిక‌కు షాక్ ఇచ్చిన తెలంగాణ టూరిజం శాఖ

Dethadi Harika
2021-03-09 17:55:50

తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ దేత్త‌డి హారిక‌కు షాక్ ఇచ్చింది. నిన్న మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా హారిక‌ను టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తూ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గుప్తా ప్ర‌క‌టించారు. హారిక‌కు అపాయింట్ మెంట్ ఇస్తున్న ఫోటోల‌ను టూరిజం శాఖ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ రోజు ఆ పోస్ట్ ను టూరిజం శాఖ తొల‌గించింది. హారిక‌ను తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించ‌డంపై టూరిజం శాఖ మంత్రికి గానీ టూరిజం శాఖలోని ఇత‌ర అధికారుల‌కు కూడా తెలియ‌ద‌ట‌. దీనిపై టూరిజం మంత్రి సీరియ‌స్ అయ్యార‌ట‌. దాంతో ఈ విష‌యం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దృష్టికి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

ఇప్పుడు టూరిజం డైరెక్ట‌ర్ శ్రీనివాస్ గుప్తా వ్య‌వ‌హారం పై అనుమానాలు మొద‌ల‌వుతున్నాయి. అసలు హార‌కను ఎందుకు అంత స‌డెన్ అంబాసిడ‌ర్ గా నియ‌మించారు. మంత్రి గానీ ఇతర అధికారుల పర్మిష‌న్ తీసుకోకుండా ఎందుకు నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా దేత్త‌డి హారిక యూట్యూబ్ లో వీడియోలు చేసి ఫేమ‌స్ అయ్యింది. అమె చేసిన ఎన్నో వీడియోల‌ను మిలియ‌న్స్ వ్యూవ్స్ వ‌చ్చాయి. అలా వ‌చ్చిన పాపులారిటీతోనే బిగ్ బాస్ లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ‌

More Related Stories