బాలీవుడ్ హీరో రణభీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్

2021-03-10 01:02:47
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తల్లి నీతు కపూర్ మంగళవారం ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. “ప్రస్తుతం రణబీర్ కోలుకుంటున్నాడు. హోం క్యారంటైన్లోనే ఉన్నాడు. మెడిసిన్ వాడుతున్నాడు. మీ అభిమానానికి ధన్యావాదలు” అంటూ షేర్ చేసింది నీతు కపూర్. ఎంఎస్ కపూర్ కూడా గత డిసెంబర్లో వైరస్ నుంచి కోలుకున్నాడు.ఇప్పటికే బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేన్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, నీతూ కపూర్, అర్జున్ కపూర్, కృతి సనన్, మలైకా అరోరా ఇంకా చాలామంది వైరస్ బారినపడి కోలుకున్నారు.