English   

అందాల అప్సర మాయలో పడిపోయిన వర్మ..

RGV
2021-03-09 18:39:09

వర్మకు ఎవరైనా ఒక హీరోయిన్ కరెక్ట్ అయ్యాడు అంటే ఆమెను అంత ఈజీగా వదిలిపెట్టడు. ప్రతి సినిమాలో రిపీట్ చేస్తూనే ఉంటాడు. ఎలాంటి సినిమా తెరకెక్కించినా అందులో ఒక పాత్ర ఆమెకు ఇస్తూ ఉంటాడు. అప్పుడప్పుడో ఊర్మిళ నుంచి నిన్నటి నైనా గంగూలి వరకు అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు వర్మ. తాజాగా ఈయన కంపెనీలో మరో హీరోయిన్ చెడిపోయింది. ఆమె పేరు అప్సర రాణి. లాక్ డౌన్ సమయంలో థ్రిల్లర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు వర్మ. ఆ తర్వాత మరో లెస్బియన్ సినిమాలో కూడా ఆమెకు అవకాశం ఇచ్చాడు. వరుసగా తాను తీస్తున్న ప్రతి సినిమాలో అప్సరకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. 

తాజాగా ఇప్పుడు ఇలా తెరకెక్కిస్తున్న డి కంపెనీ సినిమాలో కూడా అప్సరకు అవకాశం ఇచ్చాడు. తాను ఈ మధ్య కాలంలో చూసిన అత్యంత అందమైన అమ్మాయి ఈమె అంటూ ఆకాశానికి ఎత్తేశాడు వర్మ. అందుకే ఆ అందాన్ని ఆస్వాదించాలని వరుస అవకాశాలు ఇస్తున్నాడు. డి కంపెనీలో కథం అంటూ ఐటెం సాంగ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మీ అందర్నీ అందంతో మాయ చేస్తుంది అంటూ పోస్టర్ విడుదల చేశాడు రాంగోపాల్ వర్మ. మార్చి 26న ఈ సినిమా విడుదల కానుంది. దావూద్ ఇబ్రహీం జీవితం ఆధారంగా ఈ సినిమా వస్తుంది. మరి అప్సర రాణి వర్మకు ఎప్పుడు బోర్ కొడుతుందో చూడాలి.

More Related Stories