English   

శ్రీకారం సినిమాకు కేటీఆర్ బంప‌రాఫ‌ర్

 Sreekaram 
2021-03-10 13:20:00

శ్రీకారం సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హైద‌ర‌బాద్ లో గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.  అంతే కాకుండా ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అతిథిగా వ‌చ్చిన హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ...డైనమిక్ లీడర్ సోసైటీలో, సోషల్ మీడియాలో క్షణాల్లో స్పందిస్తూ ఉండే కేటీఆర్ అన్నకు స్వాగతం అంటూ కేటీఆర్ కు వెల్ కమ్ చెప్పారు. కేటీఆర్ ను ఉద్దేశించి మీరెప్పుడూ కూడా మా ఇండస్ట్రీకి అండగా ఉన్నారని అన్నారు. శ్రీకారం సినిమా చూశానని వర్షం పడేటప్పుడు వచ్చే మట్టివాసనలా ఈ సినిమా ఉంటుందని హ‌రీష్ శంక‌ర్ వ్యాఖ్యానించారు. యాక్టర్, డాక్టర్ అవ్వాలని ఎంతో మంది అనుకుంటారని కానీ ఎందుకు రైతు అవ్వాలని అనుకోవడం లేదని నేరుగా ప్రశ్నించే సినిమా ఇదన్నారు. 

ఈ సందర్భంగా హ‌రీష్ శంక‌ర్ కేటీఆర్‌ను ఓ రిక్వెస్ట్ చేసారు. సినిమాకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని హ‌రీష్ శంక‌ర్ కోరారు. చాలా నిజాయితీగా తీసిన సినిమా అని... ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చెప్పలేను కానీ.. కోట్ల మంది హృదయాలను తడుపుతుందని అన్నారు. హ‌రీష్ శంక‌ర్ రిక్వెస్ట్ పై కేటీఆర్ స్పందించారు. మంచి సినిమాలు చేస్తూ ఉంటే ఎప్పుడూ అండగా ఉంటామ‌ని అన్నారు. హ‌రీష్ చెప్పిన‌ట్టు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చేందుకు నా వంతుగా ప్రయత్నిస్తానని కేటీఆర్ హామి ఇచ్చారు. మంచి సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరించాలని పైరసి లేకుండా థియేటర్లోనే సినిమాను చూడాల‌ని కేటీఆర్ అన్నారు. 

More Related Stories