English   

మహేష్ కు నో చెప్పిన రౌడీ బేబీ...క్లారిటీ ఇచ్చిన రావిపూడి

Sai Pallavi
2021-03-10 16:04:48

రౌడీ బేబీ సాయి పల్లవి నటన తోనే కాకుండా తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఉన్న భామల్లో సాయి పల్లవి కి మించిన డ్యాన్స్ లు ఎవరూ చేయలేరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఫిదా పాట "వచ్చిందే మెల్లా మెలాగ వచ్చిందే" పాటతో యూట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేసిన సాయి పల్లవి ఇప్పుడు లవ్ స్టొరీ సినిమాలోని "సారంగదరియా" పాటతో రికార్డ్ లు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా సాయి పల్లవి సినిమాల సెలెక్షన్ విషయం లో చాలా క్లారిటీగా ఉంటుంది. తనకు స్టోరీ నచ్చితేనే సినిమాకు ఒకే చెపుతుంది. దాంతో చాలా సార్లు సాయి పల్లవి ఆ హీరోకు నో చెప్పింది. 

ఈ హీరోకు నో చెప్పిందని వార్తల్లో నిలుస్తోంది. ఇక ఇటీవల మహేష్ బాబుకు సైతం సాయి పల్లవి నో చెప్పిందని వార్తలు వార్తలు వచ్చాయి. అనిల్ రావిపూడి సాయి పల్లవి కి ఓ కథ చెప్పారని కానీ సాయిపల్లవి ఆ కథలో నటించేందుకు నిరాకరించిందని పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా ఓ   సినిమా ప్రమోషన్ ఫంక్షన్ లో మాట్లాడిన అనిల్ రావిపూడి ఎప్పటికైనా తాను ఓ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తానని చెప్పారు. అంతే కాకుండా ఆ సినిమాలో సాయి పల్లవి నటించే అవకాశం ఉందని చెప్పాడు. దాంతో సాయి పల్లవి  అసలు మహేష్ బాబు సినిమాకు నో చెప్పలేదని క్లారిటీ వచ్చేసింది. అంతే కాకుండా అనిల్ రావిపూడి సాయి పల్లవి తో తెరకెక్కించే సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని స్పష్టం అయ్యింది.

More Related Stories