English   

బిగ్ బాస్ హారిక పై టూరిజం మంత్రి షాకింగ్ కామెంట్స్..ఆమె ఎవరో కూడా తెలియదు

Dethadi Harika
2021-03-10 18:14:21

తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారిక నియామకం పై దుమారం రేగుతోంది. హారికను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ గుప్తా నియామక పాత్రలను అందజేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ అంశం పై తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. అసలు హారిక ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. అంతే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడానికి ఉన్నతాధికారుల అనుమతి గాని తెలంగాణ సీఎం కార్యాలయం అనుమతి గానీ తీసుకోలేదని అన్నారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉన్నానని ప్రచారం ముగిశాక దీని వెనక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఇదే విషయం పై కేసీఆర్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. టూరిజం డైరెక్టర్ శ్రీనివాస్ గుప్తాకు కేటీఆర్ క్లాస్ పీకినట్టు సమాచారం. ఇక హారిక యూట్యూబ్ ద్వారా తెలంగాణ యాస తో ఫేమస్ అయ్యింది. దాంతో ఆమెకు బిగ్ బాస్ కు సైతం సెలెక్ట్ అయ్యింది. అంతే కాకుండా బిగ్ బాస్ టాప్ 5 లో నిలిచి ఆకట్టుకుంది.

More Related Stories