English   

ప‌వ‌న్ క్రిష్ సినిమాకు టైటిల్ ఫిక్స్

 Pawan Kalyan
2021-03-11 11:09:35

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రీఎంట్రీ త‌రువాత డ‌బుల్ స్పీడ్ తో సినిమాల‌ను తెర‌కెక్కిస్టున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీల్ సాబ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఇక ప‌వ‌న్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కూడా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే ఈ సినిమా టైటిల్ విష‌యంలో ముందు నుండి ర‌క‌ర‌కాల పేర్లు వార్త‌ల్లో ఉన్నాయి. కాగా తాజాగా టైటిల్ పై క్లారిటీ ఇచ్చింది. ముందు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, విరూపాక్ష‌, ఓ శివం లాంటి పేర్లు ప్ర‌చారంలో ఉండ‌గా సినిమా టైటిల్ ను హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుగా చిత్ర యూనిట్ ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. అంతే కాకుండా ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్ మ‌రియు టైటిల్ రేపు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌నుంది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు హీరోయిన్ గా నిధి అగ‌ర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాను పిరియాడిక‌ల్ డ్రామాగా క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. మ‌రో వైపు ప‌వ‌న్ త‌న కెరీర్ లోనే మొద‌టి సారిగా పిరియాడిక‌ల్ డ్రామాలో న‌టిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

More Related Stories