English   

అస‌లు ఎవరు నువ్వు..సోనూసూద్ పై నెటిజ‌న్ల ఆగ్ర‌హం

 Sonu Sood
2021-03-11 16:07:45

లాక్ డౌన్ వేళ ఎంతో మందికి సహాయం చేసిన సోనూ సూద్ ఇప్పుడు తాజాగా ట్రోల్స్ దాడికి గురౌతున్నారు. సోనూసూద్ ట్విట్ట‌ర్ లో చేసిన పోస్టులే ఇప్పుడు ఆయ‌న‌పై ట్రోల్స్ కు కార‌ణం అవుతున్నాయి. తాజాగా శివ‌రాత్రి సంద‌ర్భంగా సోనూ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో శివ‌రాత్రి సంద‌ర్భంగా శివుడి ఫోటోలు షేర్ చేయ‌డానికి బ‌దులుగా ఇత‌రుల‌కు స‌హాయం చేయాల‌ని స‌ల‌హా ఇస్తూ ఓం న‌మఃశివాయ అంటూ పోస్ట్ పెట్టారు. దాంతో హూద‌హెల్ఆర్‌యూసోనూసూద్ (అస‌లు ఎవ‌రు నువ్వు) అంటూ నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. మా పండ‌గ‌లు ఎలా జ‌రుపుకోవాలో చెప్ప‌డానికి నువ్వు ఎవ‌ర‌ని ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో కూడా సోనూ సూద్ దీపావ‌లి సంధర్భంగా ట‌పాకాయ‌లు పేల్చ‌వద్ద‌ని...స‌హాయం చేసి ఇత‌రుల జీవితాల్లో వెలుగులు నింపాల‌ని స‌ల‌హా ఇచ్చారు. అయితే సోనూ బ‌క్రీద్ పండ‌గ‌కు మాత్రం ఈద్ ముభార‌క్ అంటూ ట్వీట్ చేసారు. ఈ నేప‌థ్యంలోనే సోనూసూద్ పై ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. మ‌రి దీనిపై రియ‌ల్ హీరో ఎలా స్పందిస్తాడో చూడాలి.

More Related Stories