English   

సీతకు వెల్ కమ్ చెప్పిన ఆదిపురుష్ టీమ్

Kriti Sanon
2021-03-12 11:22:39

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీ ఉన్నాడు. ఇప్పటికే ప్రభాస్ నటించిన రాదేశ్యామ్ శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కించారు. ఈ సినిమా పిరియాడికల్ ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కింది. ఇదిలా ఉండగానే సలార్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇక మరోవైపు ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో ఆది పురుష్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ ప్రభాస్ కు విలన్ గా నటిస్తున్నారు. సైఫ్ సినిమాలో విలన్ పాత్రలో రావన్ గా నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కు హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్నదానిపై ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తూ తాజాగా చిత్రయూనిట్ కృతి సనన్ కు వెల్ కమ్ చెప్పింది. కృతి సనన్ ఈ సినిమాలో సీతగా నటించబోతుంది. కృతి సనన్ తెలుగులో నంబర్ 1 సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మరి సీత పాత్రలో కృతి సనన్ ఎలా నటిస్తుందో చూడాలి.

More Related Stories