English   

మెగాస్టార్ చిరంజీవికి ఈసారి నిజంగానే కరోనా సోకిందా..?

Chiranjeevi
2021-03-12 12:40:06

ఈ మాట వినగానే చిరంజీవి అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆల్రెడీ ఒకసారి చిరంజీవి కరోనా వచ్చింది అంటూ ప్రచారం జరిగింది. ఆ విషయాన్నీ మెగాస్టార్ కన్ఫర్మ్ చేశాడు. తాను కరోనా వైరస్ బారిన పడ్డట్టు అప్పట్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు చిరంజీవి. ఇదంతా నవంబర్ లో జరిగింది. అయితే మూడు రోజుల తర్వాత రిపోర్ట్స్ తప్పుగా వచ్చాయని.. తనకు ఎలాంటి వైరస్ సోకలేదని చెప్పుకొచ్చాడు చిరంజీవి. కేవలం చిన్న మిస్టేక్ తో తనకు కోవిడ్ వచ్చింది అనుకున్నట్లు మెగాస్టార్ చెప్పేసరికి ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు. ఆ తర్వాత మళ్లీ అంత కామన్ అయిపోయింది. ఆయన షూటింగ్ చేసుకుంటున్నాడు. 

ఆచార్య సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా షెడ్యూల్ మొన్నటివరకూ ఖమ్మం జిల్లా ఇల్లందు బొగ్గు గనుల్లో జరిగింది. మార్చి 15 వరకు జరగవలసిన షెడ్యూల్ కు వారం రోజుల ముందుగానే కొరటాల శివ ప్యాకప్ చెప్పాడు. దానికి కారణం చిరంజీవి మళ్లీ అనారోగ్యానికి గురవ్వడమే అని ప్రచారం జరుగుతుంది. అక్కడున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా మెగాస్టార్ డీహైడ్రేషన్ కు లోనయ్యాడు. దాంతో ఉన్నఫలంగా షెడ్యూల్ క్యాన్సల్ చేసి హైదరాబాద్ వచ్చేశారు చిత్ర యూనిట్. 

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి కరోనా వైరస్ సోకింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కేసులు తగ్గిపోయాయని జాగ్రత్తలు కూడా తగ్గిపోయాయి. సినిమా షూటింగ్స్ లో ఎవరు మాస్కులు కూడా పెద్దగా పెట్టుకోవడం లేదు. ఎప్పటిలాగే జనాలు భారీగా వస్తున్నారు. మునపట్లా జూనియర్ ఆర్టిస్ట్ లు లొకేషన్లో వందల మంది దర్శనమిస్తున్నారు. అక్కడక్కడ జరిగిన చిన్న చిన్న అజాగ్రత్తల కారణంగా చిరంజీవి కోవిడ్ బారిన పడ్డాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. కేవలం డీ హైడ్రేషన్ కారణంగానే చిరంజీవి ఇంటి దగ్గర ఉన్నాడని ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం వస్తుంది. మరోవైపు ఈసారి నిజంగానే కరోనా వైరస్ బారిన పడ్డాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే చిరు వర్గం నుంచి క్లారిటీ రావాల్సిందే. అప్పటివరకు అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో ఈ కన్ఫ్యూజన్ తప్పదు.

More Related Stories