English   

జాతిరత్నాలు సినిమాపై బన్నీ ప్రశంసలు

Allu Arjun
2021-03-12 16:18:09

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక నవీన్ కు జోడీగా ఫారీదా అబ్దుల్లా నటించింది. ఎన్నో అంచనాల మధ్య శివరాత్రి కి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమాలో గ్యాప్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ఉందంటూ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాపై తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. 

నిన్న రాత్రి అల్లు అర్జున్ జాతిరత్నాలు సినిమా చూశానని చెప్పారు. నవీన్ పొలిశెట్టి అద్భుతంగా నటించారని..అప్ కమింగ్ హీరోగా నవీన్ నటన ఆకట్టుకుందని అన్నారు. రాహుల్ చాలా సునాయాసంగా నటించాడని చెప్పారు. ప్రియదర్శి ఫరియా నటన కూడా ప్రశంసనీయమని అన్నారు. సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన నాగ్ అశ్విన్, స్వప్న దత్, ప్రియాంక దత్ లను అభినందించారు. సినిమా తీసి గ్యాప్ లేకుండా నవ్వించిన దర్శకుడు అనుదీప్ కు స్పెషల్ థ్యాంక్స్ అన్నారు. మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకుని అందరూ సినిమాను ఎంజాయ్ చేయాలని పేర్కొన్నారు.

More Related Stories