English   

చిరంజీవి చేతులమీదుగా వైల్డ్ ట్రైలర్ విడుదల

Wild Dog teaser
2021-03-13 00:00:30

అక్కినేని నాగార్జున నటించిన తాజా సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాకు అహిషోర్ సోలమాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో డేర్ డెవిల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటించారు. చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా నాగర్జున కు జంటగా నటించింది. ఇక ఇప్పటికే సినిమా నుండి విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.

‘‘నా సోదరుడు నాగ్‌ ఇందులో ఎప్పటిలాగే చాలా కూల్‌గా.. ఎనర్జిటిక్‌గా కనిపించారు. ఏ జోనర్‌ సినిమా అయినా చేయడానికైనా భయం లేకుండా ముందడుగు వేసే నటుడు అతను. ‘వైల్డ్‌డాగ్‌’ చిత్ర బృందానికి, మా నిర్మాత నిరంజన్‌రెడ్డికి శుభాకాంక్షలు’’ -ట్విటర్‌లో చిరంజీవి

తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అక్కినేని అభిమానులను ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(NIA) ఏజెంట్‌ విజయ్‌ వర్మగా నాగార్జున అదరగొట్టారు. నాగర్జున కెరీర్ లోనే మొదటి సారిగా ఇలాంటి పాత్ర చేస్తున్నారు. దాంతో సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగా ఉన్నట్టు అర్థం అవుతోంది. ఇక ఈ సినిమాను దేశ వ్యాప్తంగా ఎప్రిల్ 2న విడుదల చేయనున్నారు.

More Related Stories