English   

శివరాత్రి రోజు అభిమానులకు విలువైన కానుక ఇచ్చిన బేబమ్మ..

Krithi Shetty
2021-03-12 17:42:46

ఒక బ్లాక్ బస్టర్ సినిమా చాలు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకోవడానికి. బేబమ్మ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులు అలాగే గుర్తు పెట్టుకున్నారు. ఉప్పెన సినిమాలో కృతి శెట్టి తన పెర్ఫార్మెన్స్ తో ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా చేసింది. తొలి సినిమాతోనే హీరోయిన్‌గా ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న ఈమె అభిమానులకు శివరాత్రి కానుకగా ఇచ్చింది. తొలి సినిమాలో మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌కు జోడీగా నటించింది కృతి శెట్టి. 'ఉప్పెన' ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో భారీ విజయం సాధించింది.

కొత్త దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సంచలన విజయం సాధించింది. ఉప్పెన సినిమా ఇంత పెద్ద విజయం సాధించడంలో ఆయన పాటలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని 'ఈశ్వరా.. పరమేశ్వరా' అంటూ సాగే ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ సినిమాను విడుదలకు ముందు ఆల్బమ్ లో చేర్చలేదు. నేరుగా సినిమాలో ఉంచారు. ఇప్పుడు ఈ పాటకు నాట్యం చేసింది హీరోయిన్ కృతి శెట్టి. ఈ వీడియోను అభిమానులతో పంచుకుంది. చంద్రబోస్‌ ఎంతో హృద్యంగా రాసిన ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్‌ ఆలపించాడు. ఈ వీడియోలో కృతిశెట్టి పలికించిన హావభావాలు అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. 

More Related Stories