English   

చరణ్ శంకర్ సినిమాకు తమన్ మ్యూజిక్

Thaman
2021-03-12 19:03:32

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాతో పాటు చరణ్ ఆచార్య సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉండగానే చరణ్ శంకర్ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాకు మ్యూజిక్ ఇవ్వడానికి తమన్ తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతోందట. అంతా ఒకే అయితే ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చానున్నారు.  ఇక ప్రస్తుతం శంకర్ ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. సినిమాలో హీరోయిన్ కోసం కూడా చిత్ర యూనిట్ సన్నాహాలు మొదలు పెట్టినట్టు సమాచారం.

More Related Stories