English   

మంచు విష్ణు ను అడ్డుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు

Vishnu Manchu
2021-03-13 07:36:25

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుకు అప్పగిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 100 శాతం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ సాక్షిగా వెల్లడించారు. దాంతో విశాఖ ప్రజలు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ కూడా నిరసనలకు మద్దతు తెలపాలని కోరారు. 

కాగా తాజాగా ఈరోజు హీరో మంచు విష్ణు మోసగాళ్ళు సినిమా ప్రమోషన్స్ కోసం విశాఖ వెళ్లగా ఆయనకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసన సెగ తగిలింది. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలపాలని...ప్రైవేటీకరణ ను అడ్డుకోవాలని విష్ణు ను కోరారు. ఆయనను అడ్డుకుని విశాఖ ఉక్కు ఉద్యమం కర పత్రాలతో ఫోటో తీసారు. ఇప్పటికే  ఇండస్ట్రీ నుండి చిరంజీవి, ఆర్ పి పట్నాయక్ మద్దతు తెలిపారని అన్నారు. ఇదిలా ఉండగా విష్ణు ప్రస్తుతం మోసగాళ్ళు సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం దేశంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా మార్చ్ 19 న విడుదల కానుంది.

More Related Stories