English   

డ్రగ్స్ కేసు..హీరో తనీష్ కు నోటీసులు

Tanish
2021-03-13 10:07:44

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. యంగ్ హీరో తనీష్ కు బెంగుళూర్  గోవిందపురా పోలీసుల నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో ఈరోజు విచారణకు హాజరు కావాలని నోటీసులు పోలీసులు జారీచేశారు. గతం లో నిర్మాత శంకర్ గౌడా అరేంజ్ చేసిన పార్టీకి వెళ్లిన సెలబ్రెటీలందరికి నోటీసులు పంపించారు.  తనీష్ , మస్తాన్ లతో పాటు మరో అయిదుగురి బెంగుళూర్  గోవిందపురా పోలీసులు నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. 

అయితే ఈ విషయం పై తనీష్ ను సంప్రదించగా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం తాను  హైద్రాబాద్ లోనే ఉన్నానని తనీష్ చెబుతున్నారు. పోలీసులు నోటీసులు పంపిన ఐదుగురిలో ఓ నిర్మాత తో పాటు వ్యాపారవేత్త ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మొదట ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసి విచారించగా వారు శంకర్ గౌడ పేరు బయట పెట్టారు. ఈనేపథ్యంలో ఆయన ఇచ్చిన పార్టీకి హాజరైన ఐదుగురిని పోలీసులు విచారణకు రావాలని ఆదేశించారు.  ఇదిలా ఉండగా గతంలోనూ 2017లో డ్రగ్స్ కేసులో అధికారులు తనీష్ ని విచారించారు.

More Related Stories